Speaker issues notices | పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకరు నోటీసులు జారీ.. మొక్కుబడిగానేనా..!
Speaker issues notices | పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకరు నోటీసులు జారీ.. మొక్కుబడిగానేనా..!

అక్షరటుడే, హైదరాబాద్: Speaker issues notices | రాష్ట్రంలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ Assembly స్పీకరు Speaker గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. భారాస నుంచి కాంగ్రెస్​లోకి జంప్​ అయిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్​రెడ్డి, సంజయ్‌, కాలె యాదయ్య, కృష్ణమోహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, మహిపాల్‌రెడ్డికి శుక్రవారం నోటీసులు పంపించారు.

వీరితోపాటు బీఆర్​ఎస్​ నేతలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు మరిన్ని ఆధారాలు అందజేయాలని స్పష్టం చేశారు.

Speaker issues notices | ఎన్నో నాటకీయ పరిణామాలు..

2023 సంవత్సరం ఎండింగ్​లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్​కు పట్టం కట్టారు. ఓటర్ల తీర్పుతో భారాస ప్రతిపక్షానికి పరిమితమైంది.

ఓటర్ల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక.. ఆపరేషన్ ఆకర్ష్‌ చేపట్టారు. అలా భారాస ఎమ్మెల్యేల్లో పలువురు కాంగ్రెస్ గూటికి చేరారు.

ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు స్పీకరుకు భారాస అగ్రనేతలు ఫిర్యాదు చేశారు. కానీ, స్పందన లేకపోవడంతో బీఆర్​ఎస్​ నేతలు హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు మెట్లెక్కారు.
ఈ విషయంలో దేశ అత్యున్నత స్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డితో పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు.
తదుపరి అంతర్గతంగా జరిగిన భేటీ అనంతరం ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా మొక్కుబడి చర్యలుగా రాజకీయవేత్తలు పేర్కొంటున్నారు.