Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

SP Rajesh Chandra | హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | మహిళను హత్య చేసిన ఒకరికి జీవిత ఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి వరప్రసాద్ (District Chief Justice Varaprasad) మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వసీముద్దీన్ అలియాస్ టిల్లు.. వసీమా బేగం ఇంటి గోడకు ఆనుకుని రేకుల షెడ్ నిర్మించాడు. షెడ్డు తొలగించే విషయమై పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా ఫలితం లేకపోవడంతో వసీమా మున్సిపల్ అధికారులకు (Kamareddy Municipal Office) ఫిర్యాదు చేసింది.

దీంతో మున్సిపల్ అధికారులు రేకుల షెడ్డును తొలగించారు. అది మనసులో పెట్టుకున్న టిల్లు వసీమాను చంపుతానని పలుమార్లు బెదిరించాడు. 2022 మే 10న తన ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వసీమాను తలపై పలుమార్లు రాడ్డుతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు వివరాలు అందజేశారు. దీంతో ముద్దాయికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వివరించారు.