అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది కష్టాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) గుర్తించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిళ్లతో సహా ఎస్పీ రాజేష్ చంద్ర తన ఇంట్లో టీ, కాఫీ తయారు చేయించి సిబ్బందికి అందజేశారు.
సిరిసిల్ల రోడ్, ఎల్లారెడ్డి రోడ్, రామారెడ్డి రోడ్డులో ఎస్పీ రాజేష్ చంద్ర పోలీసుల విధులను తనిఖీ చేశారు. ఈ సమయంలో గడ్డకట్టే చలిలో సైతం విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కష్టాన్ని స్వయంగా చూసి చలించిపోయారు. వెంటనే తన ఇంట్లో టీ, కాఫీ తయారు చేయించి సుమారు 1500 మంది సిబ్బందికి స్వయంగా అందజేశారు. దాంతో తమ కష్టాన్ని గుర్తించడమే కాకుండా టీ, కాఫీ, వాటర్ బాటిళ్లు ఎస్పీ స్వయంగా అందజేయడంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
