అక్షరటుడే, బాన్సువాడ: SP Rajesh Chandra | బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా రోల్‌కాల్‌ను పరిశీలించి, పోలీస్ సిబ్బంది హాజరు, క్రమశిక్షణ, సమయపాలనపై స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ యాప్‌ల (loan apps) ద్వారా రుణాలు తీసుకోవద్దని, ఆన్‌లైన్ గేమ్స్‌కు (online games) పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా పలువురు ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ తెలిపారు. ఇలాంటి వాటి జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు.
SP Rajesh Chandra | కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి
పోలీస్ సిబ్బంది తమకు కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే విధంగా వ్యవహరించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో, పిల్లలతో కలిసి భోజనం చేయాలని సూచించారు.
SP Rajesh Chandra | పోలీస్‌స్టేషన్ పరిసరాల పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశీలించి, స్టేషన్‌ను పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. కేసుల నమోదు, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత బలపర్చాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతాయుతంగా, గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల సమస్యలను మానవీయ కోణంలో అర్థం చేసుకుని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి పరిష్కార దిశగా పనిచేయాలని తెలిపారు.
SP Rajesh Chandra | ఆస్తి సంబంధిత నేరాలపై..
జిల్లాలో జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చోరీలకు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్సైలు, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. నిరంతర పెట్రోలింగ్, గస్తీ, అనుమానితులపై నిఘా, నేర నియంత్రణ సాధించి, పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ విఠల్ రెడ్డి, టౌన్ సీఐ శ్రీధర్, రూరల్ సీఐ తిరుపయ్యతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.