Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు.. అభినందించిన ఎస్పీ

Kamareddy | ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు.. అభినందించిన ఎస్పీ

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కుటుంబ కలహాలతో కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను దేవునిపల్లి పోలీసులు (Devunipalli Police) కాపాడారు. వారిని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మంగళవారం అభినందించారు. రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న కుంటలో సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే దేవునిపల్లి 2 ఎస్సై భువనేశ్వర్, కానిస్టేబుల్ బాలకృష్ణ ఘటనాస్థలికి వెళ్లారు.

కుంటలో పడిన మహిళను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఆమె నీరు మింగి, అపస్మారక స్థితికి చేరుకుంది. వారు వెంటనే ఆమె కడుపులో ఉన్న నీటిని బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళ ప్రాణాలను కాపాడిన ఎస్సై భువనేశ్వర్, కానిస్టేబుల్ బాలకృష్ణను ఎస్పీ రాజేష్ చంద్ర క్యాష్ రివార్డుతో అభినందించారు.

Must Read
Related News