అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | దేశంలో వివిధ రాష్ట్రాల్లోని ఎత్తయిన శిఖరాలను అధిరోహించిన తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు (Mountaineer) భుక్య యశ్వంత్‌ను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. ఈ మేరకు శనివారం యశ్వంత్ జిల్లా ఎస్పీని కలిశాడు.
యశ్వంత్ అధిరోహించిన ప్రతి శిఖరంపై భారత త్రివర్ణ పతాకంతో పాటు ఎస్పీ రాజేష్ చంద్ర ఫొటోను ప్రదర్శించి వారి నిస్వార్థ సేవకు గౌరవం తెలిపాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ (Har Shikhar Par Tiranga) మిషన్‌లో భాగంగా మిజోరాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలోని శిఖరాలను అధిరోహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కాగా.. యశ్వంత్ ఇప్పటివరకు మౌంట్ కిలిమంజారో(ఆఫ్రికా) (Mount Kilimanjaro), మౌంట్ ఎల్బ్రస్ (రష్యా) (Mount Elbrus), మౌంట్ కోసియస్కో (ఆస్ట్రేలియా)(Mount Kosciuszko), కాంగ్ యాట్సే II, యూనామ్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (Everest Base Camp) తదితర శిఖరాలను అధిరోహించాడు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో గల ఎత్తయిన శిఖరాలను అధిరోహించడం తన లక్ష్యమని యశ్వంత్ పేర్కొన్నారు.