అక్షరటుడే, పెద్దకొడప్గల్: Bharatiya Kisan Sangh | మండలంలో సోయా కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ పెద్ద కొడప్గల్ (Pedda kodapgal) గ్రామ అధ్యక్షుడు కుమార్ సింగ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కిషన్‌కు మంగళవారం సంఘ్ సభ్యులు వినతిపత్రం అందజేశారు.
అనంతరం కుమార్ సింగ్ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సోయా (Soya) పంట కోతకు రావడంతో ముందస్తుగానే సోయా కొనుగోలు కేంద్రాలను (Soybean purchasing centers) ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి ఓడి రాజు యాదవ్, సహాయ కార్యదర్శి మల్లికార్జున యాదవ్, బాన్సువాడ డివిజన్ (Banswada Division) కిసాన్ సంఘం సభ్యులు దేవి సింగ్, సంజీవ్ రెడ్డి, జక్కుల అంజయ్య, జక్కుల శివరాం, అఫ్రోజ్, రైతులు పాల్గొన్నారు.