అక్షరటుడే, వెబ్డెస్క్: Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు ఆందోళన బాట పట్టారు. సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో పెద్ద ఎత్తున సోయా సాగు చేశారు.
అయితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో బీఆర్ఎస్ (BRS), బీజేపీ నాయకులు (BJP Leaders) రైతులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. శనివారం ఉదయం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. సోయా రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రైతులతో కలిసి ముట్టడించారు. రైతులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. రైతులు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. రంగుమారిన సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Adilabad | అసెంబ్లీ ముట్టడికి యత్నం
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (BJP MLA Payal Shankar) ఆధ్వర్యంలో శనివారం ఉదయం రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు రైతులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. సోయా పంట కొనుగోలు చేయాలని, చనాక కొరాట ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా సోయా రైతుల ఇబ్బందులపై అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పందించారు. సోయా కొనుగోళ్ల కోసం కేంద్రంతో సంప్రదించామని తెలిపారు.