అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ – దన్‌బాద్ Dhanbad – SC (12791/12792) ఎక్స్‌ప్రెస్ రైలుకు చర్లపల్లి (CHZ) స్టేషన్ వద్ద తాత్కాలిక నిలిపివేత(స్టాప్)ను కల్పించింది.
ఈ తాత్కాలిక నిలిపివేత 10 రోజుల పాటు అమలులో ఉండనుంది. బుధవారం(10-09-2025) నుంచి ఈ రైలును చర్లపల్లిలో నిలిపివేయనున్నారు.
Train to halt at Cherlapalli : స్టేషన్ల వివరాలు (12791 SC-DNR)
- సికింద్రాబాద్ Secunderabad : ఉదయం 09.25 ప్రయాణం ప్రారంభం
- చర్లపల్లి: 09.40 / 09.42 ఆగడం
- కాజీపేట: 11.08 / 11.10
స్టేషన్ల వివరాలు (12792 DNR-SC)
- చర్లపల్లి: 20.42 / 20.44 ఆగడం
- సికింద్రాబాద్: 21.30 చేరడం
- కాజీపేట Kazipet : 18.23 / 18.25
చర్లపల్లిలో ఈ రైలు తాత్కాలిక నిలిపివేతను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సమీక్షిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.
చర్లపల్లి Cherlapalli రైల్వే స్టేషన్లో ఎన్ని టిక్కెట్లు విక్రయించారు..? ఎంత మంది ప్రయాణికులు ఎక్కారు/దిగారు ? అనే విషయాలపై పర్యవేక్షిస్తారు.