Homeక్రీడలుIND vs SA | నేడే భారత్‌ vs దక్షిణాఫ్రికా తొలి టెస్ట్‌.. మ‌ళ్లీ టాస్...

IND vs SA | నేడే భారత్‌ vs దక్షిణాఫ్రికా తొలి టెస్ట్‌.. మ‌ళ్లీ టాస్ ఓడిన గిల్‌, మొద‌ట బ్యాటింగ్ చేయ‌నున్న స‌ఫారీ జ‌ట్టు

సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనను టెస్ట్ సిరీస్‌తో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నవంబర్ 14, శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభం కాగా, మ్యాచ్‌లో సౌతాఫ్రికా జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs SA | ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో వ‌న్డే, టీ20 సిరీస్ ఆడిన భార‌త జ‌ట్టు ఇప్పుడు స్వ‌దేశంలో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. కోల్‌క‌తా వేదిక‌గా జ‌ర‌గుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త్ ఈ మ్యాచ్‌లో నలుగురు స్పిన్న‌ర్స్‌తో బ‌రిలోకి దిగుతుండ‌డం విశేషం.

చాలా రోజుల త‌ర్వాత పంత్ మ‌ళ్లీ టెస్ట్ జ‌ట్టులోకి రావ‌డం టీమిండియాకి (Team India) అద‌న‌పు బ‌లాన్ని ఇచ్చింది. స్వదేశంలో భార‌త జ‌ట్టు స్పిన్‌ రికార్డు ప్రపంచానికి తెలిసిందే. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రూపంలో టీమిండియాకు కఠినమైన సవాల్ ఎదురుకానుంది. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో 0-3తో ఓడిన భారత జట్టు స్పిన్‌కు కుదేలైన విషయం తెలిసిందే

IND vs SA | ప్రపంచ స్థాయి స్పిన్‌తో సఫారీలు సిద్ధం

సహజంగా పేసర్లపై ఆధారపడే జట్టుగా పేరున్న దక్షిణాఫ్రికా (South Africa), ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లను కలిగి ఉండడం ప్రత్యేకం. పాక్‌తో జరిగిన తాజా సిరీస్‌లో ఆ జట్టు తీసిన 39 వికెట్లలో 35 వికెట్లు కేశవ్ మహరాజ్, సైమన్ హార్మర్, ముత్తుస్వామి త్రయం దక్కించుకోవడం వారి స్పిన్ బలం ఎంత తీవ్రమో చూపిస్తోంది. అదే సమయంలో పాక్‌ స్పిన్నర్లు సొంతగడ్డపై 21 వికెట్లకే పరిమితం కావడం గమనార్హం. కాగా భారతదేశంలో సఫారీ జట్టు రికార్డు బలంగా లేదు. ఇక్కడ టెస్ట్ గెలిచి 15 ఏళ్లు అవుతోంది. చివరి ఏడు టెస్టుల్లో ఆరు పరాజయాలు ఎదుర్కొంది. అయినప్పటికీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ హోదాతో ఉన్న ఈ జట్టును ఎదుర్కోవడం గిల్ (Shubman Gill) సేనకు నిజమైన పరీక్ష కానుంది.

పాక్ పర్యటనకు గాయంతో దూరమైన కెప్టెన్ బవుమా తాజాగా ఫిట్‌నెస్ నిరూపించుకోగా, ఈ టెస్టుతో తిరిగి జట్టులోకి వ‌చ్చాడు. అతని రాకతో డివాల్డ్ బ్రెవిస్ బెంచ్‌కి ప‌రిమితం అయ్యాడు. సౌతాఫ్రికా టీమ్ చూస్తే.. మార్‌క్రమ్, రికెల్టన్, మ‌ల్డ‌ర్ , జోర్జి, బవుమా, స్ట‌బ్స్, కైల్,జాన్స‌న్ , మహరాజ్, హార్మర్, కోర్బిన్ చోటు ద‌క్కించుకున్నారు.అనూహ్యంగా ర‌బాడ‌, ముత్తుస్వామి ఫ‌స్ట్ టెస్ట్ మ్యాచ్‌కి ఎంపిక కాక‌పోవ‌డం విశేషం. ఇక టీమిండియా చూస్తే.. య‌శ‌స్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్, శుభ్‌మ‌న్ గిల్‌, రిష‌బ్ పంత్, ర‌వీంద్ర జ‌డేజా, ధృవ్ జురెల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్ ఉన్నారు. ఈడెన్ మ్యాచ్ మంచి ర‌స‌వ‌త్త‌రంగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Must Read
Related News