Homeక్రీడలుIND vs SA | భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ ప్రారంభం.. టాస్ గెలిచి బౌలింగ్...

IND vs SA | భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ ప్రారంభం.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు

ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ రాంచీ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో మళ్లీ టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs SA | భారత్‌-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ ఆదివారం రాంచీ వేదికగా ప్రారంభం అయింది. మూడు వన్డేల సిరీస్‌లో  భాగంగా టీమ్‌ఇండియా పూర్వప్రతాపం తిరిగి సాధించేందుకు పట్టుదలగా ఉంది.

ఈ సిరీస్‌ టీమ్‌ఇండియా (Team India)కు ఎంతో ప్రాముఖ్యతను కట్టబెట్టింది, ఎందుకంటే ఈ జట్టు ఇటీవల టెస్టు సిరీస్‌లో సఫారీల చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు టెస్టుల్లో ఓటమి, ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ ఆడలేకపోవడం టీమ్‌ఇండియా విమర్శలకు గురైంది.

IND vs SA | టీమ్‌ఇండియాకు ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్..

గతంలో ఎన్నడూ లేని విధంగా, సఫారీ జట్టు భారత్‌ను టెస్టు సిరీస్‌లో 2-0తో ఓడించింది. దీంతో వన్డేల్లో టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. రాంచీ (Ranchi)లో ఈ సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో, టీమ్‌ఇండియాకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది..ఈ సిరీస్‌ ద్వారా, విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వంటి దిగ్గజాలు సొంతగడ్డపై మరలా ఆడటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా మళ్లీ టాస్ ఓడిపోవడం కీలక పరిణామంగా చెప్పవచ్చు..భారత జట్టులో రోహిత్, కోహ్లీ , కేఎల్‌ రాహుల్‌, కోహ్లీ, సుందర్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కుల్దీప్ యాదవ్, జడేజా, హర్షిత్ రానా,అర్ష్ దీప్, ప్రసిద్ కృష్ణ ఉన్నారు.

దక్షిణాఫ్రికా (South Africa) జట్టు చూస్తే.. డికాక్, మార్క్‌రామ్, బ్రిట్జె, బ్రెవిస్‌, రికల్టన్, జోర్జి, యాన్సెన్, బాష్, సుబ్రయెన్, బర్గర్, బార్ట్మెన్

ఈ మూడు వన్డేలు, భారత జట్టుకు మాత్రమే కాదు, రెండు జట్ల అభిమానులకు కూడా చాలా ఆసక్తికరమైనవిగా మారాయి. టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలో, సఫారీలను మరింత నిరోధించడం కోసం రెండు జట్లు దృఢంగా ఉండాలి.

Must Read
Related News