అక్షరటుడే, వెబ్‌డెస్క్: South Africa women team | దక్షిణాఫ్రికా South Africa క్రికెట్ చరిత్ర ఎంతో పురాతనమైనదే అయినా, ఇప్పటివరకు వారి పురుషులు, మహిళల జట్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్ దశకు చేరలేదు.
కానీ ఈసారి వారి దేశానికి తొలి వన్డే ప్రపంచకప్ కిరీటం ODI World Cup crown అందించే దిశగా ఈ క్రికెట్లర్లు ముందుకు సాగుతున్నారు.
దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ వేదికపై కొత్త చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో Semi Final ఇంగ్లాండ్ మహిళల జట్టును ఓడించి తొలిసారిగా ఫైనల్లోకి అడుగుపెట్టింది.
ఈ అద్భుత విజయంతో సౌతాఫ్రికా జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలో ప్రపంచకప్ ట్రోఫీని అందుకునే అవకాశం దక్కించుకుంది. ఇది దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.
ఎందుకంటే ఇప్పటి వరకు పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కి చేరలేదు. అనేకసార్లు సెమీఫైనల్ వరకు వచ్చినా, ఫైనల్‌కి అర్హత సాధించడం ఇదే తొలిసారి.
ఈ విజయంతో సౌతాఫ్రికా మహిళలు తమ దేశానికి తొలి ప్రపంచకప్ కప్పును అందించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నారు.
South Africa women team | ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా దాడి
ఇంగ్లాండ్ England మహిళల జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆ నిర్ణయం వారికి బూమరాంగ్‌గా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది.
దానికి సమాధానంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలోనే కుదేలైంది. కేవలం 1 పరుగుకే 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. నాలుగో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం లభించినా, ఆ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లు మళ్లీ దూకుడు ప్రదర్శించారు.
ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు 42.3 ఓవర్లలో కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో బలమైన ఇన్నింగ్స్, బౌలింగ్‌లో కచ్చితత్వం, ఫీల్డింగ్‌లో చురుకుదనం ఇలా అన్ని విభాగాల్లో సౌతాఫ్రికా మహిళలు మెరిశారు. ఈ విజయం కేవలం సెమీఫైనల్ గెలుపు మాత్రమే కాదు, వారి పట్టుదల, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా మారింది.
ఇక ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా South Africa మహిళల ప్రత్యర్థి భారత్ లేదా ఆస్ట్రేలియా మహిళల జట్టు కానుంది. ఈ రెండు జట్ల మధ్య సెమీఫైనల్-2 అక్టోబర్ 30న జరగనుంది.
ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో సౌతాఫ్రికాతో టైటిల్ కోసం తలపడనుంది. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. న్యూ ఢిల్లీ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా లేదా అనేది చూడాలి.

