HomeజాతీయంDelhi Air pollution | దీపావళి తర్వాత భయంకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం.. ఆరోగ్య...

Delhi Air pollution | దీపావళి తర్వాత భయంకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు!

దీపావళి తరువాత ఢిల్లీ వాసుల ప‌రిస్థితి దారుణంగా మారింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాజధానిలో ఆరోగ్య సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Air pollution | రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి Diwali పండుగ అనంతరం గాలి నాణ్యత సూచిక (Air Quality Index) అత్యధిక స్థాయిలో నమోదవుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

లోకల్ సర్కిల్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. నగర వాసులు గొంతు నొప్పి, దగ్గు, కళ్ల మంట, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతున్నారు.

Delhi Air pollution | ఐదేళ్లలో అత్యధిక కాలుష్యం

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వివరాల ప్రకారం, ఢిల్లీలో PM2.5 స్థాయిలు క్యూబిక్ మీటరుకు 488 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక స్థాయిగా నమోదైంది. పండుగకు ముందు 156.6 మైక్రోగ్రాములుగా ఉన్న ఈ స్థాయిలు ఇప్పుడు మూడు రెట్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 20 రాత్రి నుండి 21 తెల్లవారుజామున వరకు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరిందని PTI నివేదించింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్‌లలో 42 శాతం ఇళ్లలో కనీసం ఒకరైనా గొంతు నొప్పి లేదా దగ్గుతో బాధపడుతున్నారు. 25 శాతం మంది కళ్ల మంట, తలనొప్పి, నిద్రలేమితో ఇబ్బందులు పడుతుండగా, 17 శాతం మంది శ్వాసలో ఇబ్బంది (Breathing Problem) లేదా ఆస్తమా తీవ్రతరమవుతోందని నివేదిక చెబుతోంది.

దీంతో 44 శాతం మంది ఇంటి బయటకు వెళ్లడానికే భయపడుతున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతున్నారు. దాదాపు మూడింట ఒక వంతు మంది కాలుష్య సంబంధిత సమస్యల కోసం వైద్యులను సంప్రదించారని వెల్లడైంది. వరదలు, పంటల ఆలస్యం కారణంగా పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టే సంఘటనలు 77.5 శాతం తగ్గినప్పటికీ, ఢిల్లీలో Delhi గాలి నాణ్యతలో పెద్దగా మార్పు కనిపించలేదని NCRI తెలిపింది.

అనేక ప్రాంతాల్లో AQI 400 దాటింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన సురక్షిత స్థాయి కంటే 24 రెట్లు ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టినా, పరిస్థితి అదుపులోకి రాలేదు. నిపుణులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద కఠినమైన నియమాలను అమలు చేయాలని, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో స్మోకింగ్ గన్స్ వినియోగాన్ని కూడా నియంత్రించాలని సూచించారు.