ePaper
More
    HomeసినిమాSonu Sood | పెద్ద సాహ‌స‌మే చేసిన సోనూసూద్.. ఒంటి చేత్తో పాముని భ‌లే ప‌ట్టుకున్నాడుగా..!

    Sonu Sood | పెద్ద సాహ‌స‌మే చేసిన సోనూసూద్.. ఒంటి చేత్తో పాముని భ‌లే ప‌ట్టుకున్నాడుగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sonu Sood | మంచి నటుడిగానే కాకుండా మాన‌వతావాదిగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ (Actor Sonu Sood) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కరోనా సమయంలో ఎంతోమందికి అండ‌గా నిలిచిన సోనూ, ఇప్పటికీ అవసరమున్న వారికి సాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన ఒక సాహసోపేత చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.

    శనివారం ఉదయం సోనూ సూద్ నివాసం ఉన్న అపార్ట్​మెంట్ సొసైటీలోకి ఓ పాము (snake) ప్రవేశించింది. సమాచారం అందుకున్న సోనూ వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లారు. అది విషం లేని పాము అని గుర్తించిన ఆయన, నిర్భయంగా ఒంటి చేత్తో పామును పట్టుకుని ఒక సంచిలో వేసి దూర ప్రాంతంలో వదిలేశారు.

    Sonu Sood | స్నేక్ కాచ‌ర్‌గా..

    ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (Instagram Account) షేర్ చేశారు. ఇందులో పామును పట్టిన తాను ఎంత జాగ్రత్తగా వ్యవహరించాడో చూపించారు. వీడియోను పోస్ట్ చేస్తూ సోనూ సూద్ (Sonu Sood) పేర్కొన్న మాటలు ఇప్పుడు నెటిజన్లను ఆకర్శిస్తున్నాయి.

    ‘మా సొసైటీలోకి ఈ పాము వచ్చింది. ఇది విషం లేనిది. కానీ, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములు పట్టే వాళ్లను పిలవండి. నాకు కొంచెం పట్టడం తెలుసు కాబట్టి చేశాను. కానీ మీరిలా చేయకండి. ఇది ప్రమాదకరం కావచ్చు’ అని హెచ్చరించారు. సోనూసూద్ సాహసానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాముకి హాని చేయకుండా దానిని సహజ వాతావరణంలో విడిచి పెట్టినందుకు ఆయన బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని ప్ర‌శంసిస్తున్నారు.

    సోనూసూద్ షేర్ చేసిన వీడియోకు వేలాది లైక్స్, షేర్లు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సోనూ సూద్ లాక్‌డౌన్ (Lockdown) సమయంలో తన సొంత ఖర్చులతో వాహనాలు ఏర్పాటు చేసి ఎంతో మంది కార్మికుల్ని తమ స్వస్థలాలకు పంపించిన విష‌యం తెలిసిందే. వేలాది మందికి అన్నదానం, తన హోటల్‌‌నే క్వారంటైన్ సెంటర్‌గా మార్చేసి ఎంతోమందికి ఆక‌లి తీర్చడం వంటివి చేశాడు. అప్ప‌ట్లో ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. రీల్ లైఫ్ విల‌న్ అయిన సోనూసూద్ రియ‌ల్ లైఫ్‌లో చేసిన సేవ‌లు చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. క‌రోనా స‌మ‌యంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆయన ఎంతో మందికి సాయం చేస్తూనే ఉన్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Sonu Sood (@sonu_sood)

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...