HomeUncategorizedSonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీ(Delhi)లోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోనియా అస్వ‌స్త‌త‌కు గుర‌య్యార‌న్న వార్త‌ల‌తో పార్టీ నేత‌లు, శ్రేణులు ఆందోళనకు గుర‌య్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.

Sonia Gandhi : ఆరోగ్య స‌మ‌స్య‌లు..

సోనియాగాంధీ గత కొద్ది రోజులుగా కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధప‌డుతున్నారు. జూన్ 7న ఆమెను సాధారణ వైద్య పరీక్షల కోసం సిమ్లా(Shimla)లోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి(Indira Gandhi Medical College Hospital)లో చేర్చారు. వైద్య పరీక్షల తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యారు. అంత‌కు ముందు ఫిబ్రవరిలో కడుపు సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్చారు. అంతకుముందు, సెప్టెంబరు 2022లో వైద్య పరీక్షల‌ కోసం సోనియా అమెరికాకు వెళ్లారు. ఫలితంగా 2022లో జరిగిన వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు హాజ‌రు కాలేదు.