అక్షరటుడే, వెబ్డెస్క్ : Sonia Gandhi | కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె మూడు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలోని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నివాసానికి వెళ్లారు. అక్కడ ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రధాన సలహాదారు నరేష్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
