అక్షరటుడే, వెబ్డెస్క్: Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీ (Delhi)లోని సర్ గంగారామ్ ఆస్పత్రి (Sir Gangaram Hospital)లో చేరారు. సోమవారం సాయంత్రం హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Sonia Gandhi | నిలకడగా ఆరోగ్యం..
సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని.. సాధారణ స్థితిలోనే ఉన్నారని హాస్పిటల్ వర్గాలు పీటీఐ వార్తా సంస్థ (PTI News Agency)కు తెలిపాయి. కాగా.. సోనియా గాంధీ కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.