అక్షరటుడే, వెబ్డెస్క్: Sonia Gandhi | ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) స్పందించారు. ఎంజీఎన్ఆర్ ఈజీఏను రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం (central government) ఈ పథకాన్ని పూర్తిగా బలహీనపరుస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కోట్లాది మంది కార్మికులు, రైతులు, భూమిలేని పేదల హక్కులపై దాడి చేస్తోందంటూ ఆమె ఆరోపించారు.
Sonia Gandhi | గాంధీ పేరును తొలగించడం సరికాదు
ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును (Mahatma Gandhi name) తొలగించడం సరికాదని సోనియా గాంధీ అన్నారు. ఇరవై ఏళ్ల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పార్లమెంట్లో ఆమోదించబడిన ఈ చట్టం, గ్రామీణ పేదలకు చట్టబద్ధమైన ఉపాధి హక్కును కల్పించిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ స్వప్నాలను సాకారం చేసే విప్లవాత్మక చర్యగా ఇది నిలిచిందని పేర్కొన్నారు.
గత 11 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం (Modi government) ఈ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. గ్రామీణ నిరుద్యోగులు, పేదల అవసరాలను విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి వంటి సంక్షోభ కాలంలో కూడా లక్షలాది గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిందన్నారు. ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి దేశ ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.
Sonia Gandhi | దేశ వ్యాప్తంగా ఆందోళనలు
ఉపాధి హామీ పథకం (employment guarantee scheme) పేరు మార్పును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మార్పును వ్యతిరేకిస్తూ నాయకులు నిరసనలు తెలిపారు. తెలంగాణలోని హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.