HomeUncategorizedSonia Gandhi | క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. మ‌ళ్లీ ఆసుప‌త్రిలో కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు

Sonia Gandhi | క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. మ‌ళ్లీ ఆసుప‌త్రిలో కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Sonia Gandhi : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Former Congress President Sonia Gandhi) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్య ప‌లుమార్లు ఆమె ఆసుప‌త్రిలో చేరి చికిత్స కూడా తీసుకుంది. గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యల కారణంగా ఆదివారం రాత్రి ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో (Sonia Gandhi Hospitalised) చేర్పించారు. ప్రస్తుతం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి నిల‌క‌డ‌గానే ఉందని చెబుతున్నారు.

Sonia Gandhi : శ్వాస కోశ స‌మ‌స్య‌లు..

ఆమె హెల్త్ కండీషన్‌ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. చికిత్సను నిపుణులైన వైద్యుల బృందం ఎప్ప‌టిక‌ప్పుడు పర్యవేక్షిస్తోంది. ఆమె ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందో ఇంకా స్పష్టంగా చెప్పలేదు. కాగా.. ఈ వార్త అందిన వెంటనే చాలా మంది కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకోవడం ప్రారంభించారు. సోనియా గాంధీ Sonia Gandhi ఆరోగ్యం గురించి పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కాగా, జూన్ 7న, సోనియా సాధారణ చెకప్ కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి కూడా వెళ్లారు. అంతకుముందు, ఫిబ్రవరి 2025లో గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్చారు.

పార్టీ వర్గాల ప్రకారం.. 2023లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా సోనియా గాంధీని సర్ గంగా రామ్ Sir Ganga Ram ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఆమెకు చెస్ట్ మెడిసిన్ విభాగంలో చికిత్స అందించారు. వైద్యుల ప్రకారం ఆ సమయంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. చికిత్స కోసం అప్పుడు ఆసుపత్రిలో చేర్పించగా, ఇప్పుడు మరోసారి ఆమె ఆరోగ్యం క్షీణించింది. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు.