HomeUncategorizedRaja Raghuvanshi | ముందే హెచ్చ‌రించిన సోన‌మ్.. నా భ‌ర్త‌ని నేనే చంపించాన‌ని ఒప్పుకున్న రాజా...

Raja Raghuvanshi | ముందే హెచ్చ‌రించిన సోన‌మ్.. నా భ‌ర్త‌ని నేనే చంపించాన‌ని ఒప్పుకున్న రాజా రఘువంశీ భార్య‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raja Raghuvanshi | మేఘాలయలో దంపతుల మిస్సింగ్​కేసు Missing case దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఈ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్యే.. భర్తను చంపించినట్లు తేలింది. ఈ మేరకు భార్య సోనమ్​ను పోలీసులు అరెస్టు(Police Arrest) చేశారు. తనకంటే ఐదేళ్లు చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకున్న సోనమ్.. అడ్డుగా ఉన్న భర్తను హనీమూన్ పేరుతో తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపించినట్లు తేలింది. నాకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు.. ఆ తర్వాత నేను ఏం చేస్తానో చూడు అంటూ తన తల్లిని సోనమ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Raja Raghuvanshi | ప‌క్కా స్కెచ్‌తో..

రాజా రఘువంశీతో (raja raghuvanshi) తనకు పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా వివాహం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని సోనమ్ తన తల్లిని ముందే హెచ్చరించిందట. సోనమ్, రాజ్ కుశ్వాహ ప్రేమించుకుంటున్న సంగతి సోనమ్ తల్లికి తెలుసట. రాజాతో పెళ్లికి ముందే సోనమ్(Sonam) తన తల్లికి రాజ్‌ను ప్రేమిస్తున్న విషయం చెప్పిందట. పెళ్లి చేయమని అడిగిందట. అయితే, ఇందుకు సోనమ్ తల్లి ఒప్పుకోలేదట. ఈ విషయాలను రాజా అన్న విపిన్ వెల్లడించినట్లు సమాచారం. రాజాతో పెళ్లికి సోనమ్ అయిష్టంగానే ఒప్పుకుంది. పెళ్లి తర్వాత చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

‘నువ్వే చూడు ఆ వ్యక్తిని ఏం చేస్తానో’ అని బెదిరించింది. ఆమె రాజాను చంపిస్తుందని ఎవ్వరమూ ఊహించలేదు’ అని విపిన్ అన్నట్లు తెలుస్తోంది. ఇక, సోనమ్ sonam తన ప్రేమ విషయం తండ్రికి చెప్పలేదు. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. తమ కింద పనిచేసే రాజ్‌ను ప్రేమిస్తున్నట్లు చెబితే తండ్రి పెళ్లికి ఒప్పుకోడని.. ఒత్తిడికి గురైతే ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందని సోనమ్ భావించింది. రాజ్‌తో పెళ్లికి తండ్రిని ఒప్పించేందుకు రాజా మర్డర్ ప్లాన్(Raja Murder Plan) వేసింది. హత్య కోసం ముగ్గురు వ్యక్తులను మాట్లాడింది. వారికి ఏకంగా 20 లక్షల రూపాయలు ఇవ్వడానికి బేరం కుదిరింది. సోనమ్, రాజ్, మరో ముగ్గురు కలిసి.. పక్కా ప్లాన్‌తో రాజాను చంపేశారు.

రాజా చిన్న బ్రదర్ విపిన్ తన స్టేట్‌మెంట్‌లో పోలీసులకు Police ఈ విధంగా తెలిపారు. “రాజ్‌తో తనకు పెళ్లి ఇష్టం లేదని సోనమ్ తన తల్లికి చెప్పింది. అయినా తల్లి ఒప్పుకోలేదు. మన సొసైటీలో వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని తల్లే ఈ పెళ్లి చేయించింది” అని విపిన్ తెలిపారు. అయితే పెళ్లి తర్వాత హత్య చేసి, తప్పించుకోగలం అని సోనమ్, రాజ్ కుష్వాహా ఎలా అనుకున్నారు. దీని వెనక పెద్ద ప్లానే ఉంది. హనీమూన్‌(Honeymoon)కి వెళ్లినప్పుడు.. దారి దోపిడీ జరిగినట్లుగా డ్రామా చెయ్యాలని వాళ్లిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. అందుకే సోనమ్.. హనీమూన్‌కి భారీగా డబ్బు, నగలను వెంట తీసుకెళ్లింది. హత్య తర్వాత ఆమె కొన్నాళ్లపాటూ.. విధవలా ఉండాలని ప్లాన్ చేసింది. అలా ఉండడం ద్వారా.. ఇది హత్య అని ఎవరికీ అనుమానం రాదు అని ఆమె అనుకుంది. కొన్నాళ్ల తర్వాత.. క్రమంగా రాజ్ కుష్వాహాని పెళ్లి చేసుకోవచ్చు అని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారమే.. కొత్త జంట మేఘాలయ(Meghalaya)కు వెళ్లడం.. అక్కడ సుపారీ గ్యాంగ్ వచ్చి రాజాను హత్య చెయ్యడం ఆ హత్యలో సోనమ్ కూడా సహకరించడం అన్నీ జరిగాయి.