HomeUncategorizedRaja Raghuvanshi | ఫిబ్ర‌వ‌రిలోనే భ‌ర్త‌ని చంపేందుకు స్కెచ్.. ఓ మ‌హిళ‌ని కూడా హ‌త్య చేయాల‌నే...

Raja Raghuvanshi | ఫిబ్ర‌వ‌రిలోనే భ‌ర్త‌ని చంపేందుకు స్కెచ్.. ఓ మ‌హిళ‌ని కూడా హ‌త్య చేయాల‌నే ఆలోచ‌న‌..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Raja Raghuvanshi | ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో తాజాగా వెలుగులోకి వస్తున్న వివరాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

రాజా భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) కేసు నుండి త‌ప్పించుకునేందుకు భారీ స్కెచ్ వేశారు. ఆమె స్థానంలో మరో అపరిచిత మహిళను హత్య చేసి, ఆ మృతదేహాన్ని సోనమ్‌దిగా నమ్మించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని హంతకులు పథకం పన్నినట్టు మేఘాలయ పోలీసులు (Meghalaya Police) వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజా హత్యకు సంబంధించిన ప్రణాళిక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇండోర్‌లో ప్రారంభమైంది. రాజాను హత్య చేసిన తర్వాత సోనమ్ ఎలా అదృశ్యం కావాలనే దానిపై హంతకులు పలు రకాలుగా ఆలోచించారట‌.

Raja Raghuvanshi | ఇంత క‌న్నింగా..

ముందుగా సోనమ్ నదిలో కొట్టుకుపోయిందని నమ్మించే ప్లాన్ వేశార‌ట‌. ఎవరైనా మహిళను హత్య చేసి, ఆ మృతదేహాన్ని కాల్చివేసి, అది సోనమ్‌దేనని చెప్పాల‌ని అనుకున్నార‌ట‌. అయితే, ఈ ప్లాన్‌లు ఏవీ కార్యరూపం దాల్చలేదు.. అని ఒక పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు. అవేవీ ఫలించకపోవడంతో షిల్లాంగ్, సోహ్రా వెళ్లాలని సోనమ్ నిర్ణయించుకుంది. అక్కడ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నిందితులందరూ నాంగ్రియాట్‌లో కలుసుకున్నారు. మే 19న నూతన వధూవరులు రాజా, సోనమ్ అస్సాం చేరుకోగా, అంతకు కొన్ని రోజుల ముందే హత్యలో పాలుపంచుకున్న ముఠా సభ్యులు అక్కడికి వచ్చారు.

ఎస్పీ సయీమ్ (SP Sayeem) వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 23న మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:18 గంటల మధ్య వీరంతా కలిసి వైసాడాంగ్ జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ అసోంలో కొనుగోలు చేసిన కత్తితో రాజ్, ఆకాశ్, విశాల్ ముగ్గురూ.. సోనమ్ ఎదుటే రాజాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని లోయలో పడేశారు.

“ఆకాష్ షర్ట్‌పై రక్తపు మరకలు ఉండటంతో, సోనమ్ తాను ధరించిన రెయిన్‌కోట్‌ను Rain Coat అతనికి ఇచ్చింది. తర్వాత ఆ రెయిన్‌కోట్‌కు కూడా రక్తం అంటడంతో ఆకాష్ దాన్ని పారేశాడు. సోనమ్, రాజా అద్దెకు తీసుకున్న టూ-వీలర్‌ను కూడా వారు ఒకచోట వదిలేశారు..” అని ఎస్పీ వివరించారు. అయితే సిలిగురిలో ఎక్కడైనా ప్రత్యక్షమై తనను ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడాలని రాజ్.. సోనమ్‌కు సూచించాడు. రాజా మృతదేహం మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల దొరకదని, పోలీసుల విచారణకు ఒకటి రెండు నెలలు పడుతుందని వారు భావించారు. ఈలోగా బాధితురాలిగా డ్రామా ఆడాలని సోనమ్ ప్లాన్ వేసింది. ఇంతలోనే రాజా రఘువంశి హత్యోదంతం వెలుగులోకి రావడం.. నిందితులు అరెస్టు కావడం దేశంలోనే సంచలనంగా మారింది.