HomeసినిమాSonal Chauhan | గోల్డెన్ ఛాన్స్ ద‌క్కించుకున్న బాల‌య్య బ్యూటీ.. భారీ ప్రాజెక్ట్‌తో రీ-ఎంట్రీ!

Sonal Chauhan | గోల్డెన్ ఛాన్స్ ద‌క్కించుకున్న బాల‌య్య బ్యూటీ.. భారీ ప్రాజెక్ట్‌తో రీ-ఎంట్రీ!

అందాల భామ సోనాల్ చౌహాన్ మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టించిన హిట్ సిరీస్ ‘మీర్జాపూర్’ ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకుంటుండగా, అందులో సోనాల్ కీలక పాత్రలో నటించనుంది

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sonal Chauhan | తెలుగు ప్రేక్షకులకు లెజెండ్, పండగ చేస్కో, సైజ్ జీరో వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో నటించనున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకుంటుండగా, అందులో సోనాల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించగా, సోనాల్ కూడా తన సోషల్ మీడియా (Social Media) ద్వారా ఈ ఆనందాన్ని పంచుకున్నారు. “ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీర్జాపూర్: ది ఫిల్మ్ నా కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలుస్తుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు నా కృతజ్ఞతలు,” అని ఆమె పేర్కొన్నారు.

Sonal Chauhan | క్రేజీ ఆఫ‌ర్..

ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం (Director Gurmeet Singh) వహిస్తుండగా, ఫర్హాన్ అక్తర్ మరియు రితేశ్ సిధ్వానీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లుగా అద్భుత విజయాన్ని సాధించిన మీర్జాపూర్ సిరీస్‌ను ఈ సారి పెద్ద తెరపై మరింత యాక్షన్, ఉత్కంఠ, ఎమోషన్‌లతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు వంటి ప్రముఖ తారాగణం కొనసాగుతుండగా, కొత్తగా జితేంద్ర కుమార్, రవి కిషన్, సోనాల్ చౌహాన్ వంటి నటులు కూడా జట్టులో చేరుతున్నారు.

మీర్జాపూర్ ప్రాంతంలో అధికార పోరాటాలు, గ్యాంగ్ వార్స్, ప్రతీకార రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు మరొక థ్రిల్లింగ్ అనుభూతిని అందించనుంది. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్న ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు అభిమానులకు కూడా భారీ సర్‌ప్రైజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ సోనాల్ చౌహాన్ కెరీర్‌లో ఒక పవర్‌ఫుల్ రీ-ఎంట్రీగా .నిలుస్తుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా, సోనాల్ చౌహ‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఆమె బాల‌య్య చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డి అందాల విధ్వంసం మాములుగా ఉండ‌దు.