HomeసినిమాSonakshi Sinha | ముంబైలో మళ్లీ హాట్ టాపిక్‌ అయిన సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ రూమర్స్‌.....

Sonakshi Sinha | ముంబైలో మళ్లీ హాట్ టాపిక్‌ అయిన సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ రూమర్స్‌.. ఏం చెప్పిందంటే..!

బాలీవుడ్‌ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ రూమర్స్ మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె త‌న భర్తతో కలిసి ఇటీవల ఓ ఈవెంట్‌కి హాజ‌రు కాగా, ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sonakshi Sinha | బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆమె ప్రెగ్నెన్సీ రూమర్స్‌ మరోసారి సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తున్నాయి. గతేడాది తన ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌ (Zaheer Iqbal)ను వివాహం చేసుకున్న సోనాక్షి ఇటీవల తన భర్తతో కలిసి విక్రమ్‌ ఫడ్నీస్‌ ఫ్యాషన్‌ షోకు హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌లో సోనాక్షి లూజ్‌ అనార్కలి సూట్‌లో మెరిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆమె ఆ డ్రెస్‌లో “బేబీ బంప్‌ (Baby Bump)కవర్‌ చేసినట్లు ఉంది” అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం “ఇది కేవలం ఫ్యాషన్‌ స్టైల్‌ మాత్రమే, ప్రెగ్నెన్సీ కాదు” అంటూ ఆమెను డిఫెండ్‌ చేస్తున్నారు. ఈ రూమర్స్‌పై సోనాక్షి, జహీర్‌ జంట ఏమైన స్పందిస్తారా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Sonakshi Sinha | అన్నీ అవాస్తవాలే..

ఈ క్ర‌మంలో సోనాక్షి త‌న భర్త జహీర్‌తో చేసిన వాట్సాప్‌ చాట్‌ స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేసి తాను ప్రెగ్నెంట్ (Pregnanat) కాదంటూ రూమ‌ర్స్ కొట్టిపారేసింది. మొత్తానికి సోనాక్షి ఇచ్చిన క్లారిటీతో గ‌త రెండు రోజులుగా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టు అయింది. గతంలోనూ సోనాక్షికి సంబంధించి ఇలాగే రూమర్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. పెళ్లి తర్వాత ఓసారి సోనాక్షి ఆస్పత్రిలో కనిపించడంతో ప్రెగ్నెంట్‌ అని రూమర్స్‌ రావడం జరిగింది. ఆ సమయంలో ఆమె స్వయంగా స్పందిస్తూ.. నేను ఆస్పత్రికి వెళ్తే వెంటనే ప్రెగ్నెంట్‌ అని నిర్ణయించేస్తున్నారు. ఇకపై ఆస్పత్రికి వెళ్లకూడదనిపిస్తోంది!” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది.

ఇక సోనాక్షి (Sonakshi Sinha) ప్రస్తుతం టాలీవుడ్‌ డెబ్యూ మూవీ ‘జటాధర’ లో నటిస్తున్నారు. యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి కీలకమైన, నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, “ధన పిశాచి” సాంగ్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి.ఈ చిత్రాన్ని వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్‌ సమర్పణలో కేఆర్‌ బన్సల్‌, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాతో పాటు రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.