HomeUncategorizedSonakshi Sinha | మ‌తాంత‌ర వివాహం చేసుకోవ‌డంతో ట్రోలింగ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన సోనాక్షి సిన్హా

Sonakshi Sinha | మ‌తాంత‌ర వివాహం చేసుకోవ‌డంతో ట్రోలింగ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన సోనాక్షి సిన్హా

ప్రస్తుతం సోనాక్షి సిన్హా తన కెరీర్‌పై మళ్లీ ఫోకస్ పెట్టింది. ఆమె నటించిన కొత్త సినిమా ‘జటాధార’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌మోష‌న్‌ కార్యక్రమలో ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sonakshi Sinha | బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్‌ని వివాహం చేసుకొని ఏడాది దాటింది. గత ఏడాది జూన్‌లో ప్రత్యేక వివాహ చట్టం కింద ఈ జంట ఒక్కటైనప్పుడు సోషల్ మీడియాలో (Social Media) పెద్ద చర్చే నడిచింది.

మతాంతర వివాహం కావడంతో కొందరు తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్రోలింగ్ చేసినప్పటికీ, కాలక్రమేణా ఆ విమర్శలన్నీ తగ్గిపోయి, ఇప్పుడు వీరిద్దరూ బాలీవుడ్‌లో అత్యంత లవ్లీ కపుల్‌గా పేరుపొందారు. ఇటీవల ఈ-టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో (E-Times Interview) సోనాక్షి తన వైవాహిక జీవితం, విమర్శలు, ప్రేమపై తన ఆలోచనలను స్పష్టంగా వెల్లడించింది.

Sonakshi Sinha  | ప్రెగ్నెన్సీపై రూమ‌ర్స్..

నేను ఎప్పుడూ నమ్మేది ఒక్కటే. ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. జనాలు ఎంత ద్వేషం చూపించినా, నిజమైన ప్రేమ దానిని అధిగమిస్తుంది. మేము ఎటువంటి డ్రామా చేయలేదు, ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నాను అంతే. నేనేమీ మతాంతర వివాహం చేసుకున్న మొదటి మహిళను కాదు, చివరిదీ కాదు. మా ప్రేమలో ఉన్న నిజాయతీని, బంధాన్ని ప్రజలు తర్వాత గమనించారు. అందుకే ఆ ట్రోలింగ్, ద్వేషం వాటంతట అవే ఆగిపోయాయి అని సోనాక్షి గట్టిగా చెప్పింది.

ఇటీవల ఒక దీపావళి పార్టీలో జహీర్, సోనాక్షిపై (Sonakshi Sinha) చేయి వేసి ఫొటోలకు పోజివ్వడం వైరల్ కావడంతో “సోనాక్షి గర్భవతి” అనే పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపించాయి. అయితే ఈ జంట వాటిని సీరియస్‌గా తీసుకోకుండా సరదాగా స్పందించి అభిమానులను అలరించారు. మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషం ఇతరులకు కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అది మంచి విషయమే కదా, అని స‌ర‌దాగా జవాబిచ్చింది సోనాక్షి. పెళ్లి తర్వాత కొంచెం బరువు పెరిగిందని వచ్చిన కామెంట్స్‌పై కూడా సోనాక్షి నవ్వుతూ స్పందించింది. ప్రజలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. నాకు పెళ్లై ఏడాదిన్నర అయింది, నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పెళ్లైన జంటలు మొదటి సంవత్సరంలో బరువు పెరుగుతారట, అది సంతోషకరమైన వివాహజీవితానికి సంకేతం అని చెప్పింది.