అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Courts | వృద్ధాప్యంలో తండ్రికి అండగా ఉండాల్సిన కొడుకు కాలయముడిగా మారాడు. నిద్రిస్తున్న తండ్రిని రుమాలితో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కోర్టులో నేరం రుజువు కావడంతో కటకటాలపాలయ్యాడు.
నాగిరెడ్డిపేట (Nagireddypet) మండలం జలాల్పూర్ (Jalalapur) గ్రామానికి చెందిన జన్కంపల్లి విఠల్‌కు ఇద్దరు కుమారులు ఉండగా ఒకే ఇంట్లో వేరువేరుగా నివసిస్తున్నారు. 2021 మార్చి 15న రాత్రి భోజనం విషయంలో తండ్రికి చిన్న కొడుకు సంగమేశ్వర్‌కు గొడవ జరగగా.. తండ్రిపై చేయిచేసుకున్న కొడుడు నీ అంతుచూస్తానని హెచ్చరించారు.
చెప్పినట్టుగానే తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో నిద్రిస్తున్న తండ్రిని టవల్‌తో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తాను చంపినట్టుగా అనుమానం రాకుండా దూలానికి ఉరేసుకొని చనిపోయినట్టు చిత్రీకరించాడు. ఈ విషయమై మృతుని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా తండ్రి విఠల్ తనకు తరచూ అన్నం పెట్టకుండా ఇబ్బంది పెట్టేవాడని పేర్కొన్నాడు.
అలాగే విఠల్ వృద్ధాప్యం కారణంగా స్వయంగా పనులు చేసుకోలేకపోవడంతో అతని బాగోగులు చూసుకోలేక తండ్రిన చంపాలని కొడుకు నిర్ణయించుకున్నట్లు తేలింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు (Kamareddy Courts) సమర్పించడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ (Chief District Judge Varaprasad) నిందితునికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.