Homeజిల్లాలుకామారెడ్డిLingampet | తండ్రిని హత్య చేసిన కొడుకు రిమాండ్‌

Lingampet | తండ్రిని హత్య చేసిన కొడుకు రిమాండ్‌

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet | లింగంపేట మండలం అయ్యపల్లి తండాలో (Ayyapalli Thanda) శనివారం రాత్రి తండ్రిని చంపిన కేసులో కొడుకు ప్రకాష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌ నాయక్‌ (CI Ravinder Naik) తెలిపారు.

సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. తండాకు చెందిన పకీర(47) మరో వివాహానికి సిద్ధమవుతుండడంతో తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఆవేశానికి గురైన కొడుకు ప్రకాష్‌ తండ్రి పకీరను గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ పేర్కొన్నారు. సమావేశంలో ప్రొబెషనరీ ఎస్సై రాఘవేంద్ర, ఏఎస్సై ప్రకాష్‌ పాల్గొన్నారు.