అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు హత్య చేశాడు. ఈ ఘటన పిట్లం మండలంలోని బ్రాహ్మణపల్లి (Brahmanpalli) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామంలో నివసించే లక్ష్మి తన కూతురిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి గతంలో వివాహం జరిపించింది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఉదయం ఇంట్లో ఉన్న అత్తను అల్లుడు కత్తితో నరికాడు.
దీంతో సంఘటనాస్థలంలోనే లక్ష్మి మృతి చెందింది. సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి (Banswada DSP Vitthal Reddy), రూరల్ సీఐ రాజేష్ (Ruler CI Rajesh) చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.