అక్షరటుడే, గాంధారి : Gandhari | ఇల్లరికం వచ్చిన అల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గాంధారిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలం ఎల్లారం గ్రామానికి చెందిన కాట్రోత్ రవి (36) సోమారం గ్రామానికి కొన్నేళ్ల క్రితం ఇల్లరికం వచ్చాడు.
అయితే అక్టోబర్ 23వ తేదీన రవి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయన భార్య అతడికి రూ. 3వేలు ఇచ్చి ఆస్పత్రిలో చూపించుకోవాలని పేర్కొంది. అయితే రవి ఆస్పత్రికి వెళ్లకపోవడంతో ఎందుకు వెళ్లలేదని భార్య గొడవపడింది. దీంతో మనస్థాపానికి గురైన రవి ఈనెల 28వ తేదీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన కుటుంబీకులు అతడిని కామారెడ్డి ఆస్పత్రికి (Kamareddy Hospital) తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని (Hyderabad) మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ రవి గురువారం ఉదయం మరణించినట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అయితే మృతుడు రవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఇటు సోమరంలో, అటు రవి పుట్టిన ఊరు అయిన లింగంపేట్ మండలం (Lingampet Mandal) ఎల్లారం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

