అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Goa | నాగర్‌కర్నూల్‌కు (Nagarkurnool) చెందిన మేకల కుటుంబం ఇప్పుడు వార్తలలో నిలిచింది. ఆ కుటుంబానికి చెందిన మేకల జగతి (Mekala Jagathi) తన నిశ్చితార్ధం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
సాధారణంగా నిశ్చితార్ధానికి ప్రైవేట్ బస్సులు (Private Bus) బుక్ చేసి బంధువులు, స్నేహితులను తీసుకెళ్లడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి మేకల అయ్యప్ప కుమారుడు జగతి తండ్రి కోరిక మేరకు గ్రామస్థులు, బంధువులను రెండు విమానాల్లో గోవాకు తరలించారు. ఇది విమానాశ్రయ సిబ్బందిని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Goa | ఆశ్చర్యపోయేలా..
మేకల అయ్యప్ప (Mekala Ayyappa) నిర్ణయం మేరకు, ఈ కార్యక్రమానికి 500 మంది రైతు కుటుంబాలు, బంధువులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు విమానాల్లో గోవాకు వెళ్లారు. రెండు విమానాల్లో కేవలం మేకల కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు మాత్రమే ఉండడం విమానాశ్రయం సిబ్బందికి అద్భుత దృశ్యంగా అనిపించింది.
ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య Kavya మాట్లాడుతూ.. తన తండ్రి కోరికను నెరవేర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, గ్రామస్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించడం కుటుంబానికి ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. స్థానిక ప్రజల కోసం వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అని అంటున్నారు.

