Homeజిల్లాలునిజామాబాద్​Mla Prashanth reddy | ఖరీఫ్​కు నీటిని విడుదల చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

Mla Prashanth reddy | ఖరీఫ్​కు నీటిని విడుదల చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth reddy | ఖరీఫ్​ (Kharif) సాగుకోసం ఎస్సారెస్పీ నుంచి కాల్వల ద్వారా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఎస్సారెస్సీ (SRSP) ఎస్​ఈ శ్రీనివాస్​గుప్తాతో మంగళవారం ఆయన ఫోన్​లో మాట్లాడారు.

నీటిని విడుదల చేసి బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్​తో పాటు సాగు నీళ్లు ఇచ్చే బాధ్యతను ఆయన గుర్తు చేశారు. ఒక తడికి నీళ్లు ఇచ్చి, వర్షాలు పడితే ఆపేయాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా నాలుగు డిమాండ్ల విషయమై ఆయన ఎస్​ఈతో మాట్లాడారు.

Mla Prashanth reddy | నాలుగు డిమాండ్లు..

లక్ష్మి కాలువ ద్వారా (Laxmi kaluva) నీటి విడుదల చేయాలని, కాకతీయ కాలువ నీటిని కొంత విడుదల చేస్తే ఉప్లూర్ వద్ద గేట్లు వేసుకుని ఆ నీటికి పంట పొలాలకు మళ్లించుకుంటారన్నారు. అదే పద్ధతిన వరద కాలువలో కొంత నీటిని కూడా వదిలితే గేట్లు వేసి ఆపుకుని పొలాలకు మళ్లించుకుంటారని, పవర్ హౌజ్ నుండి వెళ్లే వృథా నీటిని గోదావరి నదిలోకి దిగువన వదిలితే పశువులకు తాగునీటికి ఉపయోగకరమని సూచించారు.

Must Read
Related News