అక్షరటుడే, వెబ్డెస్క్: MP Aravind | బీజేపీలో ఇటీవల బండి సంజయ్ (Bandi Sanjay), ఈటల రాజేందర్ (Eatala Rajender) మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అన్నాక కొన్ని నడుస్తూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇది మొదటిది కాదని.. అలాగే చివరిది కాదని పేర్కొన్నారు.
బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao), పాత అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) కలిసి మాట్లాడుకోవాలన్నారు. అవసరం అయితే ఈ విషయమై ఇన్ఛార్జి జనరల్ సెక్రెటరీ చూసుకోవాలన్నారు. ఈ విషయాన్ని దూరం పోనియొద్దని ఆయన సూచించారు. ఏ పార్టీలో అయినా ఇలాంటివి సహజం అని పేర్కొన్నారు.
MP Aravind | రాజాసింగ్ ఎక్కడున్నా గౌరవిస్తాం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) ఎక్కడున్నా ఆయనను తాము గౌరవిస్తామని ఎంపీ అర్వింద్ (MP Dharmapuri Arvind) అన్నారు. ఆయన రాజకీయ నాయకుడి కంటే.. సిద్ధాంతపరమైన నాయకుడు అని పేర్కొన్నారు. రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారన్నారు. పార్టీలో ఎవరైనా రాజీనామా చేస్తే.. సభ్యత్వ నమోదు కోసం మిస్ కాల్ ఇస్తే మళ్లీ పార్టీ మెంబర్ అవుతారని ఆయన గుర్తు చేశారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాసింగ్ రిజైన్ చేశారన్నారు.