Homeతాజావార్తలుRajagopal Reddy | నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. రాజగోపాల్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Rajagopal Reddy | నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. రాజగోపాల్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు

క్రమశిక్షణ గల కాంగ్రెస్​ కార్యకర్తగా పార్టీ, మునుగోడు అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు దృష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​తో పాటు కాంగ్రెస్​ నాయకులు (Congress Leaders) సైతం కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

చౌటుప్పల్ మున్సిపాలిటీ (Choutuppal Municipality) పరిధిలోని పలు చెరువులను ఆయన గురువారం పరిశీలించారు. చెరువులు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రెస్ మీట్ (Press Meet) పెట్టి చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

Rajagopal Reddy | అది హైకమాండ్​ నిర్ణయం

మంత్రివర్గ విస్తరణ హైకమాండ్​ నిర్ణయమని రాజగోపాల్​రెడ్డి (Rajagopal Reddy) అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా.. తాను కట్టుబడి ఉంటానని ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్లు తనను అడ్డంపెట్టి ఏదేదో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఒక ఎమ్మెల్యేగా, క్రమశిక్షణ గల కాంగ్రెస్​ కార్యకర్తగా మునుగోడు అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రకటించారు. రాహుల్​ గాంధీ నాయకత్వంలో పార్టీ కోసం పని చేస్తానన్నారు.