అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan Rao | సోమార్ పేట్ ఘటన దురదృష్టకరమని.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (Mla Madan Mohan Rao) అన్నారు. ఈ మేరకు మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు.
ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో (Somarpet village) సోమవారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటన బాధాకరమమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటకు కారణమైన వారు ఎంతటివవారైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు విచారణ చేపట్టారని, తాను కూడా పోలీసులతో మాట్లాడడం జరిగిందని.. నిందితులకు చట్టప్రకారం శిక్షలు తప్పవన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన సోమార్పేట్ అభ్యర్థి బాలరాజుపై గెలిచిన సర్పంచ్ అభ్యర్థి వర్గీయుల్లో ఒకరు ట్రాక్టర్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాలరాజు తృటిలో తప్పించుకోగా.. ఆయనకు సంబంధించిన నలుగురు మహిళలు, ఓ బాలుడు గాయపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.