Homeజిల్లాలుకామారెడ్డిSub collector Kiranmai | భూభారతితో సమస్యల పరిష్కారం

Sub collector Kiranmai | భూభారతితో సమస్యల పరిష్కారం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Sub collector Kiranmai | పట్టా భూములను సాదాబైనామాల ద్వారా కాకుండా కొనుగోలు చేసిన వెంటనే నేరుగా తహశీల్దార్​ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామంలో గురువారం భూభారతి (Bhubarathi) రెవెన్యూ సదస్సును సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యల పరిష్కారానికి భూభారతి ద్వారా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ సువర్ణ, ఆర్ఐ వెంకటేశ్​, మాజీ ఎంపీపీ విఠల్, పెరిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.