అక్షరటుడే, ఇందూరు: Mee Seva Operators Association | తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మీసేవ ఆపరేటర్ల అసోసియేషన్(Mee Seva Operators Association) సభ్యులు కోరారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు(State IT Minister Sridhar Babu)ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మీసేవ అసోసియేషన్ అధ్యక్షుడు జీవన్‌ప్రసాద్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ, స్టేట్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ నాసిర్ అహ్మద్, జిల్లా కమిటీ మెంబర్ చింతరాజు, రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి కిరణ్, రాష్ట్ర ట్రెజరర్ శ్రీకాంత్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్లు సాగర్‌బాబు, సీహెచ్ వేణు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
