అక్షరటుడే, వెబ్డెస్క్: BSF Soldiers | పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra)ను దృష్టిలో పెట్టుకుని యాత్రికుల భద్రత కోసం భారత భద్రతా బలగాలు(Indian Security Forces) అప్రమత్తం అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఈ యాత్ర సజావుగా సాగేలా చూసేందుకుగాను భద్రతా బలగాలు ‘ఆపరేషన్ శివ’(Operation Shiva)ను ప్రారంభించాయి. జూలై 3న ప్రారంభం కానున్న ఈ యాత్ర ఆగస్టు 9 వరకు 38 రోజుల పాటు సాగనుంది. జూలై 3న మొదటి బ్యాచ్ యాత్రికులతో కూడిన బస్సులు శ్రీనగర్ నుంచి బయలుదేరుతాయి. మరోవైపు భద్రతా ఏర్పాట్లను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ షా సమీక్షించారు.
BSF Soldiers | ఇంత దారుణమా?
50వేలకు పైగా సైనికులను యాత్ర మార్గాలు, బేస్ క్యాంపులు, సున్నిత ప్రదేశాల్లో మోహరించారు. బాడీ స్కానర్లు, సీసీటీవీ కెమెరాలు, 24/7 నిఘాతో కూడిన మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నారు. అయితే అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు గాను 1200 BSF సైనికులు(BSF Soldiers) విధుల్లో చేరాల్సి వచ్చింది. కానీ, రైల్వే శాఖ వారి కోసం పంపిన రైలు స్క్రాప్ యార్డులో నుండి పంపినట్టుగా ఉంది. సీటింగ్ ఏ మాత్రం బాగోలేదు. లోపల రైలు(Train) స్థితి చూసిన సైనికులు అందులో ఎక్కేందుకు తిరస్కరించారు. దేశం కోసం రక్షణగా నిలిచే సైనికుల కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్(Union Railway Minister Ashwin Vaishnav) ఇలాంటి రైలు పంపడం అవమానకరం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం నెట్టింట దీనిపై ట్రోల్ నడుస్తుండగా, ఇంత వరకు ఏ అధికారి దీనిపై స్పందించింది లేదు. అమర్ నాథ్ (Amarnath) పవిత్ర ప్రయాణానికి రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 24 నుంచి ఆన్‌లైన్ మోడ్ ద్వారా ప్రారంభమైంది. దీని కోసం యాత్రికులు శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డుకు భారతదేశం అంతటా 540 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలు ఉన్నాయి. అక్కడ కూడా భక్తులు తమ పేరుని నమోదు చేసుకోవచ్చు.