Homeబిజినెస్​Solar Plant | సింగపూర్​ కంటే మూడురెట్ల పెద్ద సోలార్​ ప్లాంట్​.. గుజరాత్​లో ఏర్పాటు చేయనున్న...

Solar Plant | సింగపూర్​ కంటే మూడురెట్ల పెద్ద సోలార్​ ప్లాంట్​.. గుజరాత్​లో ఏర్పాటు చేయనున్న రిలయన్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Solar Plant | వివిధ వ్యాపారాలు చేపడుతూ దేశంలోనే టాప్​ కంపెనీగా ఉన్న రిలయన్స్​ ప్రపంచంలోనే పెద్ద సోలార్​ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఈ మేరకు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం దేశంలో సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి పెంచడానికి చర్యలు చేపడుతోంది. గ్రీన్​ ఎనర్జీ పాలసీ(Green Energy Policy)లో భాగంగా సౌర విద్యుత్​ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ప్రైవేట్​ కంపెనీలతో పాటు ప్రజలు వ్యక్తిగతంగా సోలార్​ ప్లాంట్లు, యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సహాకాలు అందిస్తోంది. ఈ క్రమంలో రిలయన్స్​ కంపెనీ సింగపూర్​ కంటే విస్తిర్ణంలో మూడు రెట్ల పెద్ద సోలార్​ ప్లాంట్(Solar Plant)​ ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌లోని కచ్‌లో 5,50,000 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు అంబానీ ప్రకటించారు.

Solar Plant | ప్రపంచంలోనే పెద్దది

రిలయన్స్(Reliance)​ ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్​ ప్రపంచంలో పెద్దదిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రతిరోజూ 55 MW సోలార్ మాడ్యూల్స్, 150 MWh బ్యాటరీ కంటైనర్లను మోహరిస్తుంది. దీని ద్వారా రానున్న పదేళ్లలో భారతదేశ విద్యుత్ అవసరాలలో దాదాపు 10శాతం తీర్చవచ్చని అంబానీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ జామ్‌నగర్, కాండ్లాలో రిలయన్స్ సముద్ర, భూ మౌలిక సదుపాయాలతో సజావుగా అనుసంధానం చేస్తామన్నారు.

Solar Plant | సోలార్​ ప్యానెళ్ల తయారి

రిలయన్స్​ సోలార్ PV తయారీ ప్లాట్‌ఫామ్ పనిచేయడం ప్రారంభించిందని అంబానీ తెలిపారు. దాని మొదటి 200 MW హెటెరోజంక్షన్ టెక్నాలజీ (HJT) మాడ్యూళ్లను ఉత్పత్తి చేస్తుందని ప్రకటించారు. ఇవి 10 శాతం అధిక దిగుబడి, 20 శాతం మెరుగైన ఉష్ణోగ్రత పనితీరు అందిస్తాయన్నారు.