HomeతెలంగాణSolar grid | ఔటర్​ చుట్టూ సోలార్​ గ్రిడ్​.. ఫుట్​పాత్​, నాలాలపై కూడా..

Solar grid | ఔటర్​ చుట్టూ సోలార్​ గ్రిడ్​.. ఫుట్​పాత్​, నాలాలపై కూడా..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Solar grid | ఔటర్ రింగ్ రోడ్డు వెంట (160 కిలోమీటర్ల మేర) సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశించారు. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని ఫుట్​పాత్​, నాలాల వెంట సైతం సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.

వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ 31,808 మెగావాట్లకు చేరుతుందని, ఈ మేరకు దీనికి అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్(Jubilee Hills, Hyderabad)లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తో కలిసి విద్యుత్తు శాఖపై సమీక్షించారు.

“గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యుత్తు డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరింది. గతేడాదితో పోల్చితే ఇది 9.8 శాతం ఎక్కువ” 2025-26లో 18,138 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,808 మెగావాట్లకు విద్యుత్తు డిమాండ్ చేరుకుంటుంది” అని సీఎం పేర్కొన్నారు.

కొత్తగా అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ(Clean and Green Energy Policy)పై దృష్టిసారించాలని.. ఈమేరకు సోలార్, ఫ్లోటింగ్, పంప్డ్ స్టోరేజ్(Solar, floating, pumped storage) యూనిట్లు పెంచాలన్నారు. విద్యుత్తు ఉత్పత్తిలో అనుభవమున్న ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

Must Read
Related News