Homeబిజినెస్​Emmvee Photovoltaic IPO | ఐపీవోకు సౌరశక్తి సంస్థ..

Emmvee Photovoltaic IPO | ఐపీవోకు సౌరశక్తి సంస్థ..

బెంగళూరుకు చెందిన సౌరశక్తి సంస్థ అయిన ఎమ్వీ ఫొటోవొల్టాయిక్‌ పవర్‌ ఐపీవోకు వస్తోంది. రూ. 3 వేల కోట్లను సమీకరించాలన్నది లక్ష్యం. వచ్చేవారంలో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Emmvee Photovoltaic IPO | ప్రముఖ సౌరశక్తి కంపెనీలలో ఒకటైన ఎమ్వీ ఫొటోవోల్టాయిక్‌ను (Emmvee Photovoltaic) 2007లో స్థాపించారు. ఇది సౌర ఘటాలు మరియు సౌర ఫలకాల తయారీ కంపెనీ. కర్ణాటకలోని రెండు ప్రదేశాలలో 22.44 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కర్మాగారాలున్నాయి.

ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌ (Solar PV Modules) తయారీదారులలో ఇది ఒకటిగా నిలుస్తోంది. ఈ కంపెనీ తయారు చేసే సౌర పీవీ మాడ్యూల్స్‌ వాటి విశ్వసనీయత మరియు మన్నికను ప్రదర్శించే వివిధ అంతర్జాతీయ నాణ్యత గుర్తింపులను పొందాయి. వెబ్‌సోల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, వారీ ఎనర్జీస్‌(Waaree Energies) మరియు ప్రీమియర్‌ ఎనర్జీస్‌ వంటి సహచరులతో పోటీ పడుతూ ఎమ్వీ బలమైన మార్కెట్‌ స్థానాన్ని ఏర్పరచుకుంది. మూడేళ్లలో ఇది 525 కంటే ఎక్కువ మంది కస్టమర్‌లకు సేవలందించింది. ఎఫ్‌వై25 నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ 4.89 జీడబ్ల్యూ(GW) కలిగి ఉందని, ఏప్రిల్‌, మే నెలల్లో అదనంగా 1.01 జీడబ్ల్యూ కొత్త ఆర్డర్లు వచ్చాయని డీఆర్‌హెచ్‌పీలో పేర్కొంది.

రుణ భారం తగ్గించుకోవడానికి..

మార్కెట్‌నుంచి రూ. 2,900 వేల కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో(IPO)కు వస్తోంది. ఇందులో రూ. 2,143.86 కోట్లు ఫ్రెష్‌ ఇష్యూ(Fresh issue) కాగా.. మిగిలినది ఆఫర్‌ ఫర్‌ సేల్‌. సేకరించిన నిధులలోంచి రూ. 1,607.9 కోట్లను కంపెనీ ఏకీకృత రుణాలను తగ్గించడానికి వెచ్చించనున్నారు. మిగతా మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

కంపెనీ ఆర్థిక పరిస్థితి..

కంపెనీ 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,360.33 కోట్ల ఆదాయాన్(Revenue)ని సంపాదించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ. 954.44 కోట్లుగా ఉంది. నెట్‌ ప్రాఫిట్‌(Net profit) 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 28.90 కోట్లుగా ఉండగా.. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 369.01 కోట్లకు చేరింది. ఆస్తులు రూ. 2,189.99 కోట్లనుంచి రూ. 3,913.94 కోట్లకు పెరిగాయి.

ప్రైస్‌ బ్యాండ్‌ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 206 నుంచి రూ. 217గా నిర్ణయించింది. ఒక లాట్‌(Lot)లో 69 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద ఒక లాట్‌ కోసం రూ. 14,973 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్‌ వేయవచ్చు. దీనికి రూ. 1,94,649 అవసరం.

కోటా, జీఎంపీ : క్యూఐబీలకు 75 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్ల(Retail investors)కు 10 శాతం కోటా కేటాయించారు. కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 20 గా ఉంది. అంటే లిస్టింగ్‌ సమయంలో 9 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు : ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) ఈనెల 11న ప్రారంభమవుతుంది. 13న ముగుస్తుంది. 14వ తేదీ రాత్రి షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడవుతుంది. కంపెనీ షేర్లు 18న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

Must Read
Related News