అక్షరటుడే, డిచ్‌పల్లి: తమను వీడీసీ సభ్యులు గ్రామం నుంచి సాంఘిక బహిష్కరణ (Social exclusion) చేశారని, న్యాయం చేయాలంటూ డిచ్‌పల్లి(Dichpalli) మండలం మిట్టాపల్లి(Mittapalli)కి చెందిన 8 కుటుంబాలు వాపోయాయి. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అంకిత్‌కు (Additional Collector Ankit) ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతేడాది గణేష్ నిమజ్జనం సందర్భంగా తంగేళ్ల కిషన్, మాసిపేది శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో ఇది మనసులో పెట్టకుని తమ 8 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. ఈ విషయమై డిచ్‌పల్లి సీఐ మల్లేష్(Dichpally CI Mallesh), ఎస్సై షరీఫ్‌కు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో తేలు గణేష్, మాసిపెది శ్రీనివాస్, తేలు గంగాధర్, రవి, నర్సయ్య, రాజేశ్వర్, గంగారాం, గోపీచరన్ ఉన్నారు.
