ePaper
More
    HomeజాతీయంSocial Media Influencer | సోషల్ మీడియా స్టార్ దారుణ హత్య.. బంధువులే చంపేశారా..!

    Social Media Influencer | సోషల్ మీడియా స్టార్ దారుణ హత్య.. బంధువులే చంపేశారా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Social Media Influencer | పాకిస్తాన్‌(Pakistan)లో ఘోరం జ‌రిగింది. సొంత బంధువులే సోష‌ల్ మీడియా స్టార్‌ని చంపేసిన‌ట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో యువ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్‌(Social media influencer Sana Yusuf)ను కాల్చి చంపినట్లు సమా టీవీ నివేదించింది. ఇంటికి కలవడానికి వచ్చిన బంధువు ఆమెపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అప్పర్ చిత్రాల్ ప్రాంతానికి చెందిన సనా యూసుఫ్(Sana Yousuf) సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండేది. ఆమెకు దాదాపు 4 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

    Social Media Influencer | దారుణ హ‌త్య‌..

    మంగళవారం ఆమెను కలవడానికి వచ్చిన ఓ బంధువు ఇంటి బయట సనాతో కొంతసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై పలుమార్లు కాల్పులు(Firing) జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో సనా శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు, పరువు హత్యతో సహా అన్ని కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక కార్యకర్త కుమార్తె అయిన సనా యూసుఫ్ తన వీడియోల ద్వారా ఎక్కువగా రోజువారీ జీవనశైలి, చిత్రాల్ సంస్కృతి, మహిళల హక్కులు, విద్య ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించేది.

    యువతకు ప్రేరణ కలిగించే కంటెంట్‌ను కూడా రూపొందించేది. ఆమె హత్య వార్త తెలియగానే సోషల్ మీడియా(Social Media)లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. #JusticeForSanaYousuf వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపై ట్రెండింగ్‌లో ఉన్నాయి. పాకిస్థాన్‌లో మహిళల విద్యా హక్కుల కోసం గళమెత్తిన మలాలా యూసఫ్‌జాయ్‌పై 2012లో తాలిబన్లు జరిపిన దాడిని ఇది గుర్తుకు తెస్తోంది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో కూడా పాకిస్థాన్‌లో టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న కారణంగా ఓ తండ్రి తన టీనేజ్ కుమార్తెను హత్య చేసిన ఉదంతం సంచలనం సృష్టించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...