HomeUncategorizedAustralia | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా నిషేధం.. చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

Australia | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా నిషేధం.. చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Australia | 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధాన్ని అమలు చేయడం ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా అవతరించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ మద్దతుతో జరిగిన ఒక ప్రధాన సర్వే తర్వాత ఈ సాహసోపేతమైన చర్యకు సిద్ధం అవుతోంది.

1,000 కంటే ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులు, వందలాది మంది పెద్దలు పాల్గొన్న ఏజ్ అస్యూరెన్స్ టెక్నాలజీ ట్రయల్, వ్యక్తిగత డేటాను ఎక్కువగా సేకరించకుండా ప్రస్తుత సాధనాలు వినియోగదారుల వయసును ఎంతవరకు ధ్రువీకరించవచ్చో పరీక్షించింది. దీనిని UK-ఆధారిత లాభాపేక్షలేని ఏజ్ చెక్ సర్టిఫికేషన్ స్కీమ్ (Age Check Certification Scheme – ACCS) పర్యవేక్షించింది. ఆస్ట్రేలియా ప్రతిపాదిత చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఈ ఫలితాలు కీలకమైన అడుగుగా పరిగణించబడుతున్నాయి.

Australia : వయసు ఎలా నిర్ధారిస్తారంటే..

వినియోగదారుల వయసును నిర్ణయించడానికి AI విశ్లేషించే సెల్ఫీ లేదా చిన్న వీడియోను అప్‌లోడ్ చేయొచ్చు. ఈ పద్ధతి వేగంగా పూర్తవుతుంది. బయోమెట్రిక్ డేటాను నిల్వ చేయదు కూడా.

Australia : ఎప్పటి నుంచంటే..

డిసెంబరు 2025 నుంచి.. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, X వంటి ప్లాట్‌ఫారమ్‌లను మైనర్​లు వినియోగించొద్దు. ఒకవేళ ఉల్లంఘిస్తే.. A$49.5 మిలియన్ల (ఇది దాదాపు US$32 మిలియన్లు) వరకు జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా, YouTube, WhatsApp , Google Classroomతో సహా కొన్ని ప్లాట్‌ఫారమ్‌లకు మినహాయింపు ఉంది.