అక్షరటుడే, వెబ్‌డెస్క్: Snowstorm | ఈశాన్య అమెరికా America లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా స్థానికంగా మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. జన జీవనాన్ని స్తంభింపజేస్తోంది. పలు ప్రాంతాల్లో రహదారులపై అడుగుమేర మంచు పేరుకుపోయింది.
Snowstorm | చీకట్లోనే 5.20 లక్షల ఇళ్లు
ఇళ్లు, వాహనాలపై మంచు దుప్పటి కప్పేసింది. మంచు తుపాను ప్రభావంతో గత మూడు రోజుల్లో 11 వేల విమాన సర్వీసులను నిలిపివేశారు. తీవ్రమైన మంచు తుపాను వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు తెగిపోయాయి. దీంతో దాదాపు 5.20 లక్షల ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయి చీకటి కమ్ముకుంది.
న్యూయార్క్‌లోనూ మంచు తుపాను ప్రభావం ఉంది. ఇక్కడ రోడ్లపై ఎవరూ తిరగొద్దనే ఆంక్షలు విధించారు. కాగా, తుపాను ప్రభావం తాజాగా కాస్త తగ్గడంతో ఆంక్షలు ఎత్తివేశారు. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు స్పష్టం చేశారు.
