ePaper
More
    HomeతెలంగాణNizamabad City | నగరంలో పాముల హల్​చల్​

    Nizamabad City | నగరంలో పాముల హల్​చల్​

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పాములు హల్​చల్​ చేస్తున్నాయి. సీతారాంనగర్​ కాలనీలో (Sitaramnagar Colony) పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో కాలనీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

    శుక్రవారం సాయంత్రం ఓ ఇంట్లోకి పాము వచ్చింది. వెంటనే ఇంటి యజమాని మిర్చికాంపౌండ్​కు (Mirchi compound) చెందిన పాములు పట్టే ఇమ్రాన్​కు సమాచారం ఇచ్చారు. అతడు క్షణాల్లోనే అక్కడికి వచ్చి పామును పట్టుకున్నాడు.

    వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగానే ఉంటుందని.. తనకు ఫోన్​ చేస్తే వెంటనే స్పందించి వస్తానని ఈ సందర్భంగా ఇమ్రాన్​ పేర్కొన్నారు. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లోని ఓపెన్​స్థలాల్లో మురికి నీరు చేరి పాములు, విష పురుగులకు అవాసాలుగా మారుతున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికినీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. అసలే వర్షాకాలం కావడంతో.. పాములు బయటకు రావడం సహజం. ముఖ్యంగా ఖాళీ స్థలాలు, శివారు కాలనీల్లో ఉండేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

    More like this

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...