అక్షరటుడే, వెబ్డెస్క్: Viral Video | చెన్నై (Chennai) నగరానికి చెందిన ఓ వ్యక్తి కారులో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ప్రతిరోజు మాదిరిగానే తన కారును ఇంటి బయట చెట్టు కింద పార్క్ చేసిన ఓ వ్యక్తి, మరుసటి రోజు కారును స్టార్ట్ చేసి బయలుదేరాడు.
అయితే ఆ చెట్టు కింద దాక్కున్న పాము, రాత్రి వేళ కారులోకి చొరబడింది. అది నేరుగా కారు సైడ్ మిర్రర్ (side mirror) లోపలికి జారుకుని అక్కడే దాక్కుంది. కారు కదలికలతో మిర్రర్ కొంచెం షేక్ అవ్వడంతో, అందులో దాక్కున్న చిన్న పాము (small snake) నెమ్మదిగా బయటకు రావడం ప్రారంభించింది. డ్రైవర్ ఆ దృశ్యాన్ని గమనించి వెంటనే కారును ఆపి ఆ క్షణాల్లో తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. అనంతరం ఆయన ఆ వీడియోను సోషల్ మీడియాలో (social media) పోస్ట్ చేస్తూ, “ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉండొచ్చు, కాబట్టి కార్లు లేదా బైక్‌లు చెట్ల కింద పార్క్ చేసే వారు జాగ్రత్తగా ఉండండి” అని హెచ్చరించారు.
Viral Video | పాము ప్రత్యక్షం..
ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “అదే పాము కారులో సీటు కిందో లేదా బ్రేక్ దగ్గరికి చేరి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో ఊహించలేము!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.నిపుణులు చెబుతున్నట్లు, వర్షాకాలం మరియు శీతాకాలంలో (rainy season and winter) పాములు వెచ్చని ప్రదేశాలను ఆశ్రయిస్తాయి. అందుకే అవి తరచుగా జనావాసాల్లో, వాహనాల్లో, ఇళ్లలో కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాముకాట్ల ప్రమాదాలను నివారించాలంటే వాహనాలు, బూట్లు, బెడ్లు వంటి ప్రదేశాలను వాడే ముందు ఒకసారి చెక్ చేయడం అవసరమని హెచ్చరిస్తున్నారు.
అయితే కారు నడిపే సమయంలో డ్రైవర్ పామును చూసి అప్రమత్తమై పక్కకు ఆపాడు. పామును బయటకు పంపించాడు. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. అదే పామును చూసిన కంగారులో అతను డ్రైవింగ్ లో తప్పు చేసి ఉంటే కారుతో పాటు రోడ్డున వెళ్లే ఇతన వాహనదారులు కూడా ప్రమాదానికి గురయ్యే వారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తమిళనాడులో ఒక కారు సైడ్ అద్దంలో దూరిన చిన్న పాము.
ప్రయాణంలో గాలి వేగం తగలడంతో అద్దం వెనుకనుంచి పాము బయటకొచ్చింది.
దాన్ని చూసిన డ్రైవర్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. pic.twitter.com/SyWgkr6pVt
— greatandhra (@greatandhranews) November 11, 2025
