అక్షరటుడే, వెబ్‌డెస్క్: Smriti Mandhana | విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో (T20 Match) టీమిండియా మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌కు శుభారంభం అందించడమే కాకుండా, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 48 రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన మంధాన, తన బ్యాటింగ్‌తో మరోసారి క్రికెట్ చరిత్రలో (Cricket History) నిలిచింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన కేవలం 25 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఒక భారీ మైలురాయిని అందుకుంది.
Smriti Mandhana | కొత్త చరిత్ర..
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో Cricket 4000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మంధాన రికార్డు సృష్టించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా కూడా ఆమె నిలిచింది. ఆమెకు ముందు న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ సూజీ బేట్స్ మాత్రమే ఈ మార్కును అందుకోగా, స్మృతి మంధాన మాత్రం ఈ పరుగులను అత్యంత వేగంగా సాధించి మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది.రికార్డుల వివరాల్లోకి వెళ్తే, సూజీ బేట్స్ 4000 టీ20 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడానికి 3675 బంతులు ఎదుర్కోగా, స్మృతి మంధాన కేవలం 3227 బంతుల్లోనే ఈ ఘనత సాధించింది. అత్యల్ప బంతుల్లో 4000 టీ20 పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా మంధాన చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకుంది.
మైదానంలోకి వచ్చిన వెంటనే తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించిన ఆమె, జెమిమా రోడ్రిగ్స్‌తో కలిసి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. గత ఒకటిన్నర నెలలుగా స్మృతి మంధాన వ్యక్తిగత జీవితంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు టీమిండియాను (Team India) విశ్వవిజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించి ఆనందం అనుభవించగా, మరోవైపు వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో తన వివాహాన్ని రద్దు చేసుకోవాల్సి రావడం ఆమెను మానసికంగా కలిచివేసింది. అయినప్పటికీ, ఆ ఒత్తిడిని పక్కనపెట్టి దేశం కోసం మైదానంలోకి దిగిన మంధాన చూపిన పట్టుదల, క్రీడా స్ఫూర్తికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.