అక్షరటుడే, వెబ్‌డెస్క్: Smriti Mandhana | భారత మహిళా స్టార్ క్రికెటర్, బెస్ట్ బ్యాట్ ఉమన్ స్మృతి మంధాన ఇండియన్ క్రికెట్ చరిత్రను తిరగరాసింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో పది వేల పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఆదివారం (డిసెంబర్ 28) శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20లో ఈ రికార్డు సొంతం చేసుకుంది.
Smriti Mandhana | అంతకు ముందు మిథాలి
ఈమేరకు అంతర్జాతీయ మహిళా క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా, అంతర్జాతీయంగా నాలుగో బ్యాటర్‌గా స్మృతి మంధాన రికార్డు నెలకొల్పింది. భారత మహిళా క్రికెట్లో మంమంధాన కంటే ముందు ఈ ఘనతను జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(10,868 పరుగులతో) Mithali Raj ముందు వరుసలో నిలిచింది.
ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే:
- మిథాలీ రాజ్ (IND-W): 333 మ్యాచ్‌లు, 10,868 రన్స్
- సుజీ బేట్స్ (NZ-W): 355 మ్యాచ్‌లు, 10,652 రన్స్
- షార్లెట్ ఎడ్వర్డ్స్ (ENG-W): 309 మ్యాచ్‌లు, 10,273 రన్స్
- స్మృతి మంధాన (IND-W): 281 మ్యాచ్‌లు, 10,053 రన్స్
- నాట్ స్కెవర్-బ్రంట్ (ENG-W): 278 మ్యాచ్‌లు, 8,197 రన్స్
- హర్మన్ ప్రీత్ కౌర్ (IND-W): 346 మ్యాచ్‌లు, 8,088 రన్స్
- మెగ్ లానింగ్ (AUS-W): 235 మ్యాచ్‌లు, 8,007 రన్స్