అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Music Director Palash Muchhal)తో ఆమె వివాహం రేపు జరిగేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం స్మృతి హల్దీ వేడుక (Smriti Haldi Ceremony) కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య అట్టహాసంగా జరిగింది. హల్దీ వేడుకలో స్మృతి సహచర క్రికెటర్ల హాజరు కావడం హైలైట్‌గా మారింది. పసుపురంగు ఎథ్నిక్ దుస్తుల్లో మెరిసిపోయిన జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, రాధా యాదవ్ వధువుతో కలిసి స్టెప్పులేశారు.
Smriti Mandhana | క్రికెటర్ల డ్యాన్స్..
స్మృతి ముఖంపై నవ్వులు, చుట్టూ సంబరాలు ఈ అందమైన క్షణాలకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెటర్ షఫాలీ వర్మ కూడా స్మృతి (Smriti Mandhana)తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేస్తూ..లడ్కీ వాలే అని క్యాప్షన్ పెట్టింది. అభిమానులు దీనిపై క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. కొంతకాలం ప్రేమలో ఉన్న స్మృతి–పలాష్ జంట 2024లో బంధాన్ని అధికారికం చేశారు. ఇటీవలే ముంబై డీవై పాటిల్ స్టేడియంలో పలాష్ మోకాళ్లపై కూర్చుని స్మృతికి డైమండ్ రింగ్ తొడిగిన వీడియో వైరల్ (Video Viral) అయిన విషయం తెలిసిందే. ఆమె ఓకే చెప్పింది అనే క్యాప్షన్‌తో ఆయన షేర్ చేసిన ఆ ప్రపోజల్ వీడియోకు అభిమానుల నుంచి అపారమైన స్పందన వచ్చింది.
పలాష్ ముచ్చల్ (30) బాలీవుడ్ గాయకుడు కాగా, ఆయన పాలక్ ముచ్చల్ సోదరుడు కూడా. సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఈ వివాహం క్రీడా, సినీ రంగాల బాంధవ్యానికి మరొక అందమైన మలుపుగా మారనుందని భిమానులు చెబుతున్నారు. రేపటి పెళ్లి వేడుకపై ఇప్పటికే క్రికెట్ అభిమానులు, బాలీవుడ్ వర్గాల్లో మంచి హైప్ ఏర్పడింది. స్మృతి మంధాన కొత్త జీవితానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కూడా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే.
