అక్షరటుడే, డిచ్పల్లి: TGSRTC | ఆర్టీసీలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సుల్లో కొన్ని అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయి. పలుమార్లు మార్గమధ్యలో నిలిచిపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. తాజాగా ఎలక్ట్రికల్ బస్సులో పొగలు రాగా.. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన డిచ్పల్లి మండలం ధర్మారం(బి)లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న ఎలక్ట్రికల్ బస్సు ధర్మారం గ్రామానికి రాగానే ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బ్యాటరీ నుంచి కాలిపోయిన వాసన వస్తుండడంతో గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. బ్యాటరీని వెంటనే చల్లార్చడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.