INDVsENG
INDVsENG | బ‌జ్ బాల్ ఆట‌తో ఇంగ్లండ్‌ని ఆదుకున్న బ్రూక్, స్మిత్.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్: INDVsENG | ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్, భారత్​ (England – India) మ‌ధ్య గ‌ట్టి ఫైట్ న‌డుస్తోంది. భార‌త బౌల‌ర్స్ మొద‌ట్లో బాగానే రాణించినా.. త‌ర్వాత ధారాళంగా ప‌రుగులు ఇచ్చారు. మ్యాచ్ మూడోరోజు ఉదయం సెషన్‌లో ఆతిథ్య జట్టు ఆదిలోనే ఐదు కీలక వికెట్లు కోల్పోయినా, హ్యారీ బ్రూక్ (Harry Brook) (102 నాటౌట్), జేమీ స్మిత్ (Jamie Smith) (111 నాటౌట్) అద్భుతంగా రాణించి జట్టును నిలబెట్టారు. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఒకే ఓవర్‌లో జో రూట్ (22), బెన్ స్టోక్స్(0)లను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను తీవ్ర ఒత్తిడిలో నెట్టినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన బ్రూక్–స్మిత్ జంట ఇంగ్లండ్ జ‌ట్టును ఆదుకున్నారు.

INDVsENG | గేమ్ తిప్పేశారుగా..

ఈ ఇద్దరూ బజ్ బాల్ స్టైల్‌లో (buzz ball cricket style) ధాటిగా ఆడి, ఆరో వికెట్‌కు కేవలం 154 బంతుల్లోనే 165 పరుగులు జోడించారు. జేమీ స్మిత్ 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి బ్యాటింగ్ ప్రతిభను చాటారు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో (Prasidh Krishna bowling) ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఈజీగా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మరింత దూకుడుగా ఆడిన స్మిత్ మ్యాచ్ మూడో రోజు ఉదయం సెషన్‌ను పూర్తిగా తనదే చేసుకున్నాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 249/5గా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం బ్రూక్–స్మిత్ జోడీ (Brook-Smith partnership) చాలా డేంజ‌ర్‌గా క‌నిపిస్తోంది.

భారత బౌలర్లు మొదట్లో చెలరేగినా, తర్వాత కనీస స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్‌లో నిల‌వాలంటే మిగిలిన వికెట్లను రెండో సెషన్‌లోనే తీయాల్సిన అవసరం టీమిండియాకు ఉంది. లేదంటే ఇంగ్లండ్ వైపు మ్యాచ్ మళ్లే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టు ఐదు వికెట్లు కోల్పోయి 269 ప‌రుగులు చేసింది. బ్రూక్ 102, స్మిత్ 111 క్రీజులో ఉన్నారు. ఇద్ద‌రు సెంచ‌రీలు చేయ‌డంతో టీమిండియా (Team India) ఆధిక్యం త‌గ్గింది. 318 పరుగుల ఆధిక్యంలో మాత్ర‌మే ఉంది. మొత్తంగా, మ్యాచ్ మూడో రోజు ఉత్కంఠ భరితంగా మారింది. రెండో సెషన్‌లో ఎవరు నిలుస్తారో చూడాలి.